విభజన కారకుడు జగన్ అందుకే కెసిఆర్ మద్దతు..

విభజన కారకుడు జగన్ అందుకే కెసిఆర్ మద్దతు..

– బీజేపీ వట్టి మాటలు కట్టి పెట్టాలి…

– విభజన కారకుడు జగన్ అందుకే కెసిఆర్ మద్దతు..

2014 లో జగన్ సహకరించారని 2019 లో రుణం తీర్చుకోనున్నామని కేటీఆర్ చెప్పడంలో ఆంతర్యం ప్రజలు గ్రహించాలి

– టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాస రెడ్డి

విభజన చట్టం హామీలను నెరవేర్చకుండా,మిత్రధర్మం, పాటించకుండా,రాష్ట్రాన్ని ఆదుకోకుండా సీఎం చంద్రబాబు నాయుడు పై బీజేపీ నోరుపారేసుకోవడం హేయం,క్షమించరాని విషయమని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస రెడ్డి అన్నారు.

గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కడప ఉక్కు ఏర్పాటులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఎటువంటి ప్రతిపాదనలు,అందివ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం సిగ్గుచేటన్నారు.

సాక్షాత్తు సీఎం చంద్రబాబు 11 సార్లు కేంద్రానికి కడపలో ఉక్కు ఏర్పాటు చేయాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెల్పారన్నారు.

టీడీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి .!
ఓర్వలేక వైసీపీతో కలసి ఉక్కు ఏర్పాటు ను అడ్డుకోవడం ప్రజలందరికీ తెలుసన్నారు.

నార్త్ ఇండియా కాదు బీజేపీ ఆటలు సాగటానికి ఆంద్రప్రదేశ్ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్ట హామీలను నెరవేర్చాలన్నారు.దుగ్గిరాజ పట్నం ఓడరేవు,విశాఖపట్నం రైల్వేజోన్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలపాలన్నారు.

రాష్ట్ర విభజన కారకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు తెలంగాణాకు మద్దతు ఇచ్చినందుకే ఈ రోజు జగన్ కు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారన్నారు.

ఆంద్రప్రదేశ్లో వైసీపీకి 2019 ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని, జరుగుతున్న పరిణామాలను గమనిిస్తున్నారన్నారు.

జగన్ హైదరాబాద్ కేంద్రంగా ఆంద్రప్రదేశ్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు.

జగన్ చెల్లలు షర్మిల కాలం చెల్లి పోయిన ఆరోపణలతో తెరపైకి తేవడం రాజకీయ అజ్ఞానమే అన్నారు.

వైసీపీ రాజకీయ శున్యతతో నిందారోపణలు, కుట్రలు దూకుడుతో వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ఛిద్రం చేస్తున్నారన్నారు.

గత 9 ఏళ్లగా ముఖ్యమంత్రి కావాలనే ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో లేకుండా చేసిన ఘనత జగన్ దే అన్నారు.

మూడునెలల్లో ముఖ్యమంత్రి ని అవుతా ఓపిక పట్టండి అంటూ 9 ఏళ్లగా జగన్ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ రాజకీయ సంక్షోభం సృష్టించి వైసీపీ నాయకులందరికి పిచ్చోళ్ళను చేశారన్నారు

అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు ప్రత్యేక హోదా సాధన,ప్రగతి చంద్రబాబు తోనే సాధ్యమన్నారు.

కేంద్రం సహకరించక పోయినా,రాష్ట్రం నష్టాల్లో ఉన్నా, హామీలు నెరవేర్చడం తో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతివైపు నడిపించడం సీఎం చంద్ర బాబుకే సాధ్యమైందన్నారు

2019లో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు

Close Menu