జిల్లా అధ్యక్షుని సమక్షంలో 120 కుటుంబాలు టీడీపీ లోకి చేరిక

జిల్లా అధ్యక్షుని సమక్షంలో 120 కుటుంబాలు టీడీపీ లోకి చేరిక

నగరంలోని ఆటోనగర్ వైసీపీకి చెందిన 120 కుటుంబాలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస రెడ్డి సమక్షంలో ఆదివారం టీడీపీలోకి చేరారు.
3 వ డివిజన్ కార్పరేటర్ బాలకొండయ్యా ఆధర్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సంధర్బంగా జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.

ముఖ్యమంత్రి చేపట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీలోకి చేరిన కుటుంబాలను అభినందించారు

చంద్రబాబు నాయుడు నాయకత్వానికి అండగా నిలబడి రాష్ట్ర ప్రగతికి అందరం పాటుపడాలని పిలుపునిచ్చారు

అనంతరం 3వ డివిజన్ నూతన టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు ఇకనుంచి డివిజన్ సమస్యలు నూతన కార్యాలయాన్నుంచి పరిష్కారానికి కృషి జరగనున్నట్లు తెలిపారు

ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు జిలానిభాషా,నగర కార్యదర్శి వికాస్ హరి నియోజకవర్గ ఇంచార్జ్ అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.

Close Menu