ప్రజాసంక్షేమం టీడీపీ లక్ష్యం

ప్రజాసంక్షేమం టీడీపీ లక్ష్యం

– రేపటి నుంచి పెంచిన ఫించన్లు పంపిణీ

– అభ్యర్థులను సీఎం ప్రకటిస్తారు

– టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి

ప్రజాసంక్షేమం టీడీపీ లక్ష్యమని ఆదిశగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దే నని టీడీపీజిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస రెడ్డి అన్నారు.

శుక్రవారం జిల్లాపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న
ముఖ్యమంత్రిని అందరూ అభినందిస్తున్నారన్నారు

రేపటి నుండి పెంచిన పెన్షన్ల పంపిణీ చేయనున్నారన్నారు

డ్వాక్రా మహిళలకు 10 వేలు కూడా ఇవ్వనున్నామన్నారు

పేద రైతుల కోసం రైతు రుణమాఫీ కూడా చేసిన ఘనత టీడీపీదేనన్నారు

త్వరలో రైతులకు శుభవార్త అందించనున్నామన్నారు

తెలుగుదేశం అధికారం లో ఉంటే భరోసా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారన్నారు

రాష్టం లో ప్రతిపక్షం పాత్ర శూన్యం అన్నారు

రాబోవు ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలవనున్నామని ధీమా వ్యక్తం చేశారు

ప్రతిపక్షం రాష్టంలో కనుమరుగు కానుందన్నారు

జిల్లాలో ఎవరికి వారుగా అభ్యర్థులుగా ప్రకటించుకోవడం మంచి పద్ధతి కాదని
ముఖ్యమంత్రి ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారన్నారు

ఇక మీదట ఇలా ఎవరు కూడా స్వీయంగా ప్రకటించుకోవద్దని తెలిపారు.

కడపజిల్లా లో 9 స్థానాలను టీడీపీ కైవసం చేసుకొనున్నదన్నారు

Close Menu