మహిళా సంక్షేమమే టీడీపీ లక్ష్యం

మహిళా సంక్షేమమే టీడీపీ లక్ష్యం

– చెల్లెళ్ళ కోసం చంద్రన్న కానుక

– టీడీపీజిల్లా అధ్యక్షుడు వాసు

– ఘనంగా పసుపు కుంకుమ – పింఛన్ల ఉత్సవం

శనివారం స్థానిక నగర పాలక సంస్థ పరిధిలోని మూడవ డివిజన్ రామాంజనేయపురంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పింఛనుదారులకు పదిరెట్లు రెట్టింపు చేసిన పింఛన్ల పంపిణీ, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద రూ. పదివేల రూపాయల చెక్కుల పంపిణీ నిమిత్తం పసుపు కుంకుమ సంబరం… పింఛన్ల ఉత్సవం కార్యక్రమం జరిగింది

జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రారంభించి చెక్కులు పంపిణీ చేశారు

ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే టీడీపీ లక్ష్యం అన్నారు ఆదిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు

చెల్లెళ్ళ కోసం చంద్రన్న
డ్వాక్రా మహిళలకు
10 వేల రూపాయలు , వృదులకు రెట్టింపు పింఛన్ల పంపిణీ చేస్తున్నారన్నారు

అక్కచెల్లెళ్ళకు చంద్రన్న కానుకగా
పసుపు కుంకుమ గా 10 వేల రూపాయల నగదు చెల్లింపు నేడు చెల్లించడం ఘనత టీడీపీదే అన్నారు

ప్రతి ఆడపడుచు సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు

ఈ కార్యక్రమంలో కమిషనర్ లవన్న, టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు జిలానిభాషా, వికాస్ హరి,డివిజన్ ఇంచార్జ్ బాలకొండయ్యా తదితరులు పాల్గొన్నారు.

Close Menu