విభిన్న ప్రతిభా వంతులకు స్కూటర్స్ పంపిణీ

విభిన్న ప్రతిభా వంతులకు స్కూటర్స్ పంపిణీ

విభిన్న ప్రతిభా వంతులకు స్కూటర్స్ పంపిణీ చేసిన టీడీపీజిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాస రెడ్డిపేదల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాస రెడ్డి అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లాకలెక్టర్ అధ్యక్షతన విభిన్న ప్రతిభావంతులు 61 మందికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం స్కూటర్స్ అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ విభిజిత రాష్టం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం లక్ష్యమన్నారు ఆదిశగా చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారువిభిన్న ప్రతిభావంతులకు స్కూటర్స్ పంపిణీ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జేసీ శివారెడ్డి,వికలాంగుల సంక్షేమ శాఖా అధికారి, జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షులు, టీడీపీ నగర అధ్యక్షుడు జిలాని బాషా,నాయకులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Close Menu